మాజీ ఎంపిటిసికి రసమయి నివాళులు

బెజ్జంకి, ఆంధ్రపభ : మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపిటిసి నల్లగొండ లక్ష్మీ గుండెపోటు తో బుధవారం మృతిచెందారు. ఈ విషాద వార్త గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ తోటపల్లి గ్రామానికి చేరుకుని, వారి ఫార్ధివ దేహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లగొండ లక్ష్మీ మరణం వారి కుటుంబానికి మాత్రమే కాకుండా పార్టీకి కూడా తీరని లోటని అన్నారు. ప్రజా సేవలో ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply