OTT | బాహుబలి టార్చ్ బేరర్ తో పాటు ఏకంగా 40 సినిమాలు

  • ఓటీటీ ప్రియులకు పండగే..
  • ఈ వారం ఏకంగా 40 సినిమాలు, సిరీస్‌లు..!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఓటీటీ ప్రేక్షకులకు ఈ వీకెండ్ వినోదాల జాతరే. జూన్ 22 నుంచి 28 వరకు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్, సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే వంటి తదితర వేదికల్లో ఏకంగా 40 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వీటిలో తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరంగా 12కు పైగా తెలుగు, తెలుగు డబ్బింగ్ చిత్రాలు అందుబాటులోకి వస్తుండగా.. హారర్, యాక్షన్, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, థ్రిల్లర్, డాక్యుమెంటరీ వంటి అన్ని జానర్లలో వినోదం సిద్ధంగా ఉంది.

ఈ వారం మిస్ కాకూడని ప్రధాన విడుదలలు

నెట్‌ఫ్లిక్స్

బాహుబలి: ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) – జూన్ 26
బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్) – జూన్ 25
అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ సీజన్ 2 – జూన్ 25
రాజా శివాజీ – జూన్ 26
లిటిల్ బ్రదర్ – జూన్ 26
నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో – జూన్ 26
ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ – జూన్ 26

జియో హాట్‌స్టార్

అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ – జూన్ 24
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3
లింగం – జూన్ 26
ది బేర్ సీజన్ 5

అమెజాన్ ప్రైమ్ వీడియో

ది షీప్ డిటెక్టివ్స్ – జూన్ 24
బ్రేక్‌ఫాస్ట్ – జూన్ 24
గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2 – జూన్ 23
సీ యూ ఎట్ వర్క్ టుమారో

ఈటీవీ విన్

కొత్త కొత్తగా – జూన్ 25
డియర్ కేరళ కుట్టి – జూన్ 25

లయన్స్‌గేట్ ప్లే

ది యెతి – జూన్ 26
దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ – జూన్ 26

జీ5

ప్రేమలా కండీషన్స్ అప్లై – జూన్ 26
ముతస్సీ – జూన్ 26
మమ్మటియన్ స్టార్స్ – అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్.

ఇతర ప్లాట్‌ఫార్మ్స్

పర్ఫెక్ట్ ఫ్యామిలీ – సోనీ లివ్
కప్: లవ్ ఆల్ ప్లే – మనోరమ మ్యాక్స్
కుండ్డాల పురాణం – సైనా ప్లే
మొహబ్బతి రట్ – చౌపాల్

ఈ వారం విడుదలల్లో ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’, ‘అవతార్ 3’, ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3’, ‘బ్లాస్ట్’, ‘కొత్త కొత్తగా’, ‘ది షీప్ డిటెక్టివ్స్’, ‘లింగం’ వంటి చిత్రాలు, సిరీస్‌లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు అన్ని రకాల వినోదాన్ని అందించేలా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ సిద్ధమయ్యాయి.