Audi Sheela | అందుబాటులో ఉంటా..

Audi Sheela | అందుబాటులో ఉంటా..

  • గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..
  • కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆడి శీల

Audi Sheela | ఆంధ్రప్రభ, గుడిహత్నూర్ : ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతాన‌ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆడి శీల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండి నిబద్ధతతో సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, పేదల సంక్షేమమే తన ప్రధాన అజెండా ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని, కాంగ్రెస్ పార్టీ విధానాలను గ్రామస్థాయిలో అమలు చేస్తానని అన్నారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.