10-rupee-coin : ₹ 10 నరకం Andhra Prabha Spl News

₹ 10 నరకం Andhra Prabha Spl News

  • అన్నవాహికలో నాణెం స్ట్రక్​
  • ఆటలో ప్రమాదం
  • బాలుడు విలవిల
  • ఎండోస్కోపీతో ప్రాణరక్షణ
  • శ్రీ మహదేవ్ హాస్పిటల్ వైద్యుల సత్వర స్పందన
  • డా. హరిప్రసాద్ సేవలకు ప్రశంసలు

( మైలవరం, ఆంధ్రప్రభ)

10-rupee-coin : తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 10 రూపాయల నాణెం మింగిన ఓ బాలుడిని అత్యవసర వైద్య సేవలతో కాపాడిన ఘటన ఎప్టీఆర్​ జిల్లా మైలవరంలోని శ్రీ మహదేవ్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. వైద్యుల వివరాల ప్రకారం, ఈ నెల 10వ తేదీన బాలుడు ఆటలాడుతుండగా 10 రూపాయల నాణెం పొరపాటున మింగాడు. అనంతరం బాలుడికి అసౌకర్యం కలగడంతో కుటుంబ సభ్యులు వెంటనే శ్రీ మహదేవ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో నిర్వహించిన ఎక్స్-రే పరీక్షల్లో నాణెం గుండెకు సమీపంలోని అన్నవాహిక (ఈసోఫేగస్)లో ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకుండా అత్యవసర చికిత్సకు శ్రీకారం చుట్టారు.

10-rupee-coin : ఆపరేషన్​ ఇలా

శ్రీ మహదేవ్ హాస్పిటల్ వైద్యులు డా. హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం ఎండోస్కోపీ విధానం ద్వారా అన్నవాహికలో ఇరుక్కున్న నాణెాన్ని విజయవంతంగా బయటకు తీశారు. చికిత్స అనంతరం బాలుడు క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి సరైన వైద్యం అందించడం వల్లే బాలుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. చిన్నారులు ఆడుకునే సమయంలో నాణేలు, చిన్న వస్తువులు, బొమ్మల భాగాలు వంటి వాటిని నోటిలో పెట్టుకోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు, బంధువులు డా. హరిప్రసాద్,మహదేవ్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో సత్వర నిర్ణయం తీసుకుని విజయవంతంగా చికిత్స అందించిన వైద్య బృందంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

Leave a Reply