లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ ఇన్స్పెక్టర్..

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ ఇన్స్పెక్టర్..

ఏసీబీ డి.ఎస్.పి బాలకృష్ణ

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హరి ప్రసాద్ రెడ్డి ఒక వ్యక్తి నుండి 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న న్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది వివరాలు డిఎస్పి ఏసిబి బాలకృష్ణ చెప్పారు ఈనెల 5వ వ తేదీన ఒక వ్యక్తి నుండి తన ట్రాక్టర్ను జెసిబి ని విడిపించడానికి 30,000 ఎస్సై డిమాండ్ చేయగా 20000 ఇస్తానని చెప్పి ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆ వ్యక్తి ఆశ్రయించాడు. తన దగ్గర ఉన్న ఆధారాలను అధికారులకు చూయించి తనని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాడు.

ఈనెల 5వ తేదీన ట్రాక్టరు లో ఇసుక తరలిస్తుండగా తిమ్మాజీపేట ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి జెసిబిని ట్రాక్టర్నుపట్టుకొని కేసు నమోదు చేసి మైనింగ్ అధికారులకు అప్పజెప్పాడు. మైనింగ్ అధికారులు 60 వేల రూపాయలు జరిమానా విధించారు. జరిమానా కట్టి రసీదును చూపించి ఎస్సైని విడుదల చేయాలని కోరగా ఆయన 30000 రూపాయలు ఇచ్చి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు .ఇవ్వకపోతే విడిచి పెట్టమని చెప్పడంతో ఏసీబీని ఆ వ్యక్తి ఆశ్రయించాడు. ఆ వ్యక్తి ఇచ్చిన ఆధారాలను తీసుకొని సోమవారం తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్కు ఏసీబీ అధికారులు చేరుకొని ఎస్సైని అదుపులోకి తీసుకున్నట్లు డి.ఎస్.పి బాలకృష్ణ చెప్పారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి వివరించారు