బంగారం వ్యాపారం పేరుతో కోట్ల టోకరా..

బంగారం వ్యాపారం పేరుతో కోట్ల టోకరా..

  • నమ్మిన వారిని ముంచి పరార్..

నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట కేంద్రంగా బంగారు బిస్కెట్ల హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి పలువురు వ్యాపారులు, బంధువులకు భారీ టోకరా వేసి పరారైన ఘటన కలకలం రేపుతోంది. నాదెండ్ల మండలానికి చెందిన అతడు నమ్మకంగా వ్యవహరిస్తూ పలువురి వద్ద బంగారు బిస్కెట్లు తీసుకుని వ్యాపారం నిర్వహించేవాడని సమాచారం. ఇటీవల బంగారం ధరలు పెరగడంతో వ్యాపారులు తమ బంగారం తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయగా కుటుంబంతో కలిసి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు