5 months | వృద్ధ దంపతుల బలవన్మరణం..

5 months | వృద్ధ దంపతుల బలవన్మరణం..

5 months | కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : కలిసే బతికారు.. చావులోనూ కలిసే పయనమయ్యారు. బిడ్డలకు ఘనంగా పెళ్లిళ్లు చేసి, తమ బాధ్యత తీరిందని భావించారో ఏమో.. ఆనందంగా చిన్న కూతురికి, ఐదు నెలల మనవడికితో సారే పెట్టి సాగనంపిన కొన్ని గంటల్లోనే ఆ దంపతులు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ జిల్లా చోటుచేసుకున్నకంచికచర్లలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. పరిటాల గ్రామానికి చెందిన దొండపాటి సాంబశివరావు ఎలియాస్ సాంబయ్య (67), భార్య దుర్గ (58)కి ముగ్గురు సంతానం.

కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తెలు హరిత, లక్ష్మీ సుధా చౌదరికి ఘనంగానే వివాహాలు కూడా చేశారు. సోమవారం చిన్న కూతురు లక్ష్మీ సుధా చౌదరిని, ఐదు నెలల మనవడికి సారే పెట్టి ఎంతో ఘనంగా అత్తవారింటికి పంపారు. మంగళవారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి తలుపు తట్టగా, తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లారు. అప్పటికే సాంబశివరావు అపస్మారకస్థితిలో ఉండటం, లక్ష్మీ దుర్గ కొన ఊపిరితో ఉండటం వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వారి పక్కనే పురుగుమందు డబ్బా ఉండటం ఇద్దరు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే సాంబశివరావు మృతి చెందగా.. భార్య లక్ష్మీ దుర్గని చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరింసచారు. అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా దంపతులు ఇద్దరూ ఆకస్మికంగా మృతి చెందటంతో పరిటాల గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సౌమ్య, యార్డ్ చైర్మన్ కోగంటి..

గడ్డి మందు సేవించి మృతి చెందిన సాంబయ్య, దుర్గ దంపతుల పార్థివదేహాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు బుధవారం సందర్శించి నివాళులర్పించారు. డీవీఆర్ ఏరియా హాస్పిటల్ కమిటీ చైర్మన్, కూటమినేతలతో కలిసి సంతాపం తెలియజేస్తూ తమ సానుభూతిని ప్రకటించారు.

Leave a Reply