పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ, కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్ పర్తి మండలం అనంత సాగర్ శివారులో పేకాట శిబిరం పై తగిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈసంఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెష్టు చేయగా, మరో ముగ్గురు తప్పించుకున్నారు. స్థానిక హసన్ పర్తి సీఐ వట్టే చేరాలు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం రావడంతో హసన్‌పర్తి ఎస్ఐ సుజిత్ ఆధ్వర్యంలో సిబ్బంది ధనుంజయ, భరత్ కుమార్, విద్యాసాగర్, యాదయ్యలతో కలిసి అనంతసాగర్ శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించామని తెలిపారు.

దీంతో ముత్యాల మహేష్ కుమార్,కిమిడి శ్రీనివాస్, సిద్ధపాటి నాగ శ్రీనివాస్,బుస దేవేందర్ లను అరెష్టు చేశామని, పేకాట ఆట ఆడుతున్న వారిలో మహేందర్, సుధాకర్ నిమ్మల రాజులు పరారైనట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు 9వేల750ల నగదును, పేక ముక్కలు, నాలుగు మోటార్ సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారైన ముగ్గురిని త్వరలో పట్టుకుంటామని అన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు. పేకాట ఆడడం, రేషన్ బియ్యం అమ్మడం, గంజాయి, పొగాకు ఉత్తులు సేవించడం, అక్రమ ఇసుక రవాణా లాంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియపర్చాలని సీఐ కోరారు.

Leave a Reply