February 21 | ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

February 21 | ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

February 21 | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ, తెలుగు శాఖధిపతి పరమేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటిని రక్షించుకోవాలని, భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవవైవిద్యాన్ని కాపాడుకోగలమని తెలిపారు. బంగ్లాదేశీయులు చేసిన ఉద్యమానికి నివాళిగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారని తెలిపారు.

భాషలు, సంస్కృతిని, చరిత్రను పరిరక్షించే అత్యంత కీలకమైన సాధనాలు మాతృభాషలను ప్రోత్సహించడం వల్ల సాధ్యమవుతుందని, అందుకే అమ్మ భాషను అందరూ కాపాడుకోవాలని , జీవనం కోసం పరభాషను నేర్చుకోవచ్చు గాని కన్నతల్లి వంటి మన తెలుగు భాషను ప్రతి ఒక్కరు గౌరవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకట రాముడు, కంప్యూటర్ అధ్యాపకులు సుధాకర్ పాల్గొన్నారు.

Leave a Reply