Protest | జేసీ కనుసన్నల్లోనే పోలీసులు..
Protest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదని, తమ పార్టీ చేపడుతున్న శాంతియుత నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారని కేతిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని, అందుకే తమకు నిరసన తెలిపే హక్కును కూడా దూరం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపట్టే అవకాశం కల్పించాలని, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా పోలీసులు వ్యవహరించాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు.
