ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీగా డీసీఓ అరుణకుమారి
అనంతపురం బ్యూరో, : ఐసీడీఎస్ అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ)గా డిసిఓ కడప అరుణకుమారి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఉదయం డిసిఓ ఐసీడీఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. డిసిఓకి మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి, నోడల్ ఆఫీసర్ వనజాక్షి, సీనియర్ అసిస్టెంట్లు దువ్వూరు బాబా నూరుద్దీన్, ధనలక్ష్మి, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఖాజీ రఫీమున్నీసా, డీసీపీఓ మంజునాథ్, చైల్డ్ లైన్ కృష్ణమాచారి, ఇస్నిప్ అసిస్టెంట్ కో ఆర్డినేటర్ షాహిన, సిబ్బంది స్వాగతం పలికారు. పూల మొక్క అందించారు. శాలువ కప్పి సన్మానించారు. అనంతరం సిబ్బందితో ఆమె పలు అంశాలపై సమీక్షించారు. శిశు గృహాలో మృతి చెందిన సంఘటన పై జిల్లా అధికారుల పై వేటు వేశారు.

