control | జిల్లాలో గంజాయిని అరికట్టాము..

control | జిల్లాలో గంజాయిని అరికట్టాము..
ఘంటసాల మండలంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంది
ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు
చిన్న పిల్లలు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి
ఏలూరు రేంజ్ ఐజిపి జి.వి.జి.అశోక్ కుమార్
control | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు రేంజ్ ఐజిపి జి.వి.జి.అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం, కృష్ణా జిల్లా ఘంటసాల పోలీస్ స్టేషన్ను ఆయన వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పూలమొక్క నాటారు. మీడియాతో మాట్లాడుతూ ఘంటసాల మండలంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట్ల 54 బ్లాక్ స్పాట్లుగా గుర్తించామన్నారు.
ఘంటసాల మండలంలో గత మూడు సం వత్సరాలు రెండు చోట్ల యాక్సిడెంట్లు జరిగాయని తెలిపారు. జాతీయ రహదారిపై లంకపల్లి, జీలగలగండి వద్ద ప్రమాదాలు జరిగి 15 మంది మృతి చెందారని తెలిపారు. మూడు సంవత్సరాలలో 24 ప్రమాదాలు జరిగాయని తెలిపారు. రెండు స్పాట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంట ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టామని తెలిపారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు. డిఎస్పీలు, సీఐలు, ఎస్ ఐలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలు, యువతుల భద్రతకై అవగాహన కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్నట్లు తెలి పారు.
రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గినట్లు తెలిపారు? శక్తి టీమ్ సభ్యులు టీవ్ టీజిర్లపై నిఘా పెట్టి హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమానికి పోలీసు శాఖ పని చేస్తుందని తెలిపారు చిన్న పిల్లలను ఇబ్బందులు పెట్టే ముద్దాయిలపై శిక్షణ పడేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ వి. విద్యాసాగర్ నాయుడు, మచిలీపట్న డిఎస్సీ సిహెచ్.రాజా, అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు కె.ఈశ్వరరావు. యువకుమార్, ఎస్.బి సీఐ సత్యకిషోర్, ఎస్ఐలు వేమన చందన, గౌతమ్ కుమార్, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
