DSP | బాపట్లలో కార్డన్ సెర్చ్

DSP | బాపట్లలో కార్డన్ సెర్చ్

DSP | బాపట్ల క్రైమ్, ఆంధ్రప్రభ : మత్తుకు చిత్తవుతున్న యువత లక్ష్యంగా నేర రహిత బాపట్ల ధ్యేయంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దృష్ట్యా స్థానిక రైలుపేట ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిలో నిర్వ‌హించిన‌ తనిఖీల్లో సరైన ధ్రువ‌పత్రాలు లేని ఆటో, 51 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

DSP

ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ బాపట్లలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, నేరాలను అదుపు చేసేందుకు నిరంతరం ఇటువంటి సోదాలు నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి సోదాలు నిర్వహించి, ప్రతి ఇంటిలోని వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను ఆన్‌లైన్‌లో సరిచూశామని చెప్పారు. అనుమానితులు ఎవరైనా మీ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

DSP

పట్టణ సిఐ ఆర్. రాంబాబు, రూరల్ సీఐ శ్రీనివాసరావు, బాపట్ల సర్కిల్ సీఐ హరికృష్ణ, పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్, మహిళా ఎస్ఐ చంద్రావతి, చందోలు ఎస్ఐ రాజ్యలక్ష్మి, ఈగల్ టీమ్ పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply