30 years | చంద్రబాబు చరిష్మ‌తోనే బిల్ గేట్స్ రాక..

30 years | చంద్రబాబు చరిష్మ‌తోనే బిల్ గేట్స్ రాక..

  • రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..
  • ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గద్దె అనురాధ

30 years | విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు దశాబ్దాలకుపైగా అపూర్వ సేవలు అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చరిష్మా, దూరదృష్టి నాయకత్వం ఏమాత్రం తగ్గలేదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. ఈ సందర్బంగా గద్దె అనురాధ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాతృత్వవేత్త బిల్ గేట్స్ 30 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించడం వెనుక ప్రధాన కారణం చంద్రబాబు విజన్, పరిపాలనా నైపుణ్యం, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఉన్న విశ్వసనీయతేనని అన్నారు.

గేట్స్ వంటి ప్రపంచ స్థాయి వ్యక్తి రాష్ట్రాన్ని సందర్శించడం ప్రతి ఆంధ్రప్రదేశ్ వాసికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పే అవకాశంగా మారిందని గద్దె అనురాధ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న సాంకేతిక, వ్యవసాయ, ఆరోగ్య, విద్యా రంగ సంస్కరణలు అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు.

30 years |

బిల్ & మెలిందా గేట్స్ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, వ్యవసాయం రంగాల్లో చేస్తున్న సేవలు ప్రపంచానికి ఆదర్శమని, అలాంటి సంస్థలతో భాగస్వామ్యం రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. రైతుల ఆదాయ వృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ఈ సహకారం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.

చంద్రబాబు పారదర్శక పాలన, అభివృద్ధి పట్ల అంకితభావం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించే సామర్థ్యం వల్లే అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు, సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులవుతున్నారని గద్దె అనురాధ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు అవసరమని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలకు ప్రజలు అండగా నిలవాలని గద్దె అనురాధ పిలుపునిచ్చారు.

Leave a Reply