దుర్గమ్మ నిత్య అన్నదానానికి భారీ విరాళం

దుర్గమ్మ నిత్య అన్నదానానికి భారీ విరాళం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి నిత్య అన్నదాన పథకానికి భక్తులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. మంగళగిరికి చెందిన ప్రముఖ దాత పీవీపీ కృష్ణకుమార్ కుటుంబీకులు, అనిల్ కుమార్ దంపతుల పేరున రూ.1,00,116 విరాళాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ప్రధానాలయ సూపరింటెండెంట్ డి.వి. సత్యనారాయణ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, విరాళ రసీదులను అందజేశారు.

Leave a Reply