8వ డివిజన్లో ‘కారు’ జోరు..

8వ డివిజన్లో ‘కారు’ జోరు..
పాలకొండ, మాణిక్యమ్మ దేవాలయం, రబీయా నగర్ కాలనీలలో..
అభ్యర్థి మూశ సరస్వతి నరేందర్ కు ప్రజల బ్రహ్మరథం..
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్లో ఎన్నికల సందడి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పాకొండ, మాణిక్యమ్మ దేవాలయం, రబియానగర్ కాలనీలతో పాటు పరిసర కాలనీల్లో బిఆర్ఎస్ అభ్యర్థి మూశ సరస్వతి నరేందర్ కు లభిస్తున్న ప్రజాదరణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతివీధి, ప్రతికాలనీలో అడుగుపెట్టిన సరస్వతీ నరేందర్ కు స్థానికులు బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు.
‘కారు’ గుర్తుతో సాగుతున్న ప్రచార ర్యాలీలు డివిజన్ స్పష్టమైన ఊపును తీసుకొచ్చాయి. పాలమూరు మున్సిపాలిటీ వ్యవస్థలో ఉన్న సమయంలో కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహించిన మూశ నరేందర్ అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో త్రాగునీరు, సిసి రోడ్, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ప్రజలు గుర్తుచేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పడిన తరువాత డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ప్రజలు, అనుభవం ఉన్న నాయకుడిగా మరోసారి మూశ సరస్వతి నరేందర్ కు కార్పొరేటర్గా ఎన్నుకుంటే ఎనిమిదవ డివిజన్ మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
