TG|శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం

TG| శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం

  • సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్

TG| సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ తెలియజేశారు. ఆదివారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుల్తానాబాద్ మండలం ప్రజలతో మమేకమై ముందుకు సాగుతామన్నారు. ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి 24 గంటల పాటు పనిచేస్తామన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ కు పాల్పడితే జైలు శిక్ష తప్పదన్నారు. విజిబుల్ పోలింగ్ అమలు చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలోపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నూతన ఎస్ఐ కి సిబ్బంది తో పాటు పలువురు, మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply