Nizamabad | బైక్ ను ఢీకొన్న కంటైన‌ర్ – ఇద్ద‌రు స్పాట్ డెడ్

నిజామాబాద్ – జిల్లాలో బైక్ ను నేటి ఉద‌యం కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే బైక్ పై వెళ్తున్న బావ బామ్మర్దులు ఇద్దరు మృతిచెందారు. బైక్ ను ఢీకొన్న తర్వాత కంటైనర్ పల్టీలు కొట్టింది. కేక్ కొనేందుకు బైక్ పై బయల్దేరిన బావ బామ్మర్దులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు వివేక్ నగర్ తండాకు చెందిన శ్రీనివాస్, నవీన్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

Leave a Reply