పంతం కృష్ణ ఇంటింటి ప్రచారం..
పంతం కృష్ణ ఇంటింటి ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో చివరి రోజు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి పంతం కృష్ణ ముమ్మరంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని తాను వార్డు అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం జరిపి తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
