ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ రాజు

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌదరపల్లి సంపత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరు గుతూ తనదైన శైలిలో ఓటును అభ్యసిస్తున్నారు. గత రెండు సంవ త్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ తాను గెలిస్తే వార్డులో చేయాల్సిన అభివృద్ధి పనులను ప్రతి ఒక్కటి చేసి చూపిస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, విద్యుత్ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు ఇలా పలు వాటిపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఆదరించండి గెలిపించండి అంటూ ముందుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
