అక్రమాల ఆరోపణల ముసురులో రేంజర్
ఎన్నో అక్రమాలకు కేరాఫ్ రేంజర్
- అక్రమంగా కలప తరలించిన రేంజ్ అధికారి ..
- ఆలస్యంగా వెలుగులోకి
కొత్తగూడ, ఆంధ్రప్రభ : అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొత్తగూడ అటవీ శాఖ రేంజర్ వ్యవహారం రోజుకో విధంగా బయటపడుతుంది. అక్రమ ఇసుక, అటవీశాఖ కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ లే కాకుండా వచ్చిన కాడికి ముడుపులు తీసుకుంటూ ఎదోచ్ఛగా రాజ పాలన కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ కలపతో ఫర్నిచర్లు చేయించుకున్న రేంజర్..

గంగారం రేంజ్ పరిధిలోని ఓ గ్రామం నుండి అటవీ శాఖ అరేంజ్ అధికారి అక్రమంగా కలపను తరలించి మండల కేంద్రానికి సమీపంలోని గ్రామంలో వడ్రంగి వద్ద ఫర్నిచర్లు చేయించుకున్నట్లు ఆలస్యంగా పుకార్లు షికారులు కొడుతున్నాయి. తన ఇంటికే కాకుండా, సమీప బంధువుల పెళ్ళికి కూడా ఫర్నిచర్లు పంపించినట్లు విశ్వాసనీయ సమాచారం.
మొదటి నుండే వివాదానికి కేరాఫ్..
కొత్తగూడ అటవీశాఖ రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వివాదానికి కేరాప్ అడ్రస్ గా తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. ఇంటి అవసరానికి గుంజలు తీసుకొస్తున్న జంగవానిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతుపై దాడి చేసి ఎడ్ల బండి ని తగలపెట్టిన చరిత్ర రేంజర్ కి ఉన్నది. ఇలా చెప్పుకుంటే రేంజర్ చరిత్ర ఓ పుస్తకమే..
అటవీ జంతువుల అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఎం చేస్తున్నట్టు?
కొత్తగూడ రేంజ్ పరిధిలో అటవీ జంతువుల వేట కొనసాగుతున్న అటవీశాఖ అధికారులు ఎం చేస్తున్నట్లు అటవీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. నిరంతరం అటవీ పర్యవేక్షణ లో ఉంటున్నామాని గొప్పలు చెప్పుకుంటున్న రేంజ్ అధికారి కి అక్రమ మాంసం రవాణా జరుగుతుంటే తెలీదా అనే ప్రశ్న చర్చ సాగుతుంది. శుక్రవారం మండల కేంద్రం లో అటవీ జంతువు మాంసం రోడ్డు మీద దొరకడం తో పలు అనుమానాలు కలుగుతోంది. అక్రమంగా అటవీ జంతువుల మాంసం విక్రయాలు జరుగుతుంటే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం తీరు బహటంగానే కనపడుతోంది.
కింది స్థాయి ఉద్యోగులను వేధింపులు..
అటవీ శాఖ అతిథి గృహంలో కూర్చుని కింది స్థాయి ఉద్యోగులను విధుల పట్ల వేధింపులు తీవ్రస్థాయిలో చేస్తాడని ఆరోపణలు ఉన్నాయి. గతంలో తన వేధింపులను భరించలేక ఉద్యోగులు అటవీ శాఖ యూనియన్లు సంప్రదించినట్లు సమాచారం. కింది స్థాయి ఉద్యోగులు సెల్యూట్ చేసిన వారిని పట్టించుకోకుండా దూరంగా నిలబెడతాడని విమర్శలు ఉన్నాయి.
కొత్తగూడ అటవీశాఖ రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వివాదానికి కేరాప్ అడ్రస్ గా తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. ఇంటి అవసరానికి గుంజలు తీసుకొస్తున్న జంగవానిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతుపై దాడి చేసి ఎడ్ల బండి ని తగలపెట్టిన చరిత్ర రేంజర్ కి ఉన్నది. ఇలా చెప్పుకుంటే రేంజర్ చరిత్ర ఓ పుస్తకమే..
