అగ్ని ప్రమాదాలపై పెట్రోల్ బంక్ లో అవగాహన

పరకాల, ఆంధ్రప్రభ ; అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం రోజు పరకాల ఫైర్ ఆఫీసర్ వి భద్రయ్య ఆధ్వర్యంలో పరకాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా అగ్ని ప్రమాదాల నివారణ సంబంధించిన వాల్ పోస్టర్లను అంటించారు. ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నమని పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, గ్రామీణ ప్రాంతాలలో అవగాహన సదస్సులు మాక్ డ్రిల్స్ అలాగే విద్యుత్ భద్రత, ఎల్పీజీ వినియోగం, గ్యాస్ లీకేజీ నివారణ, అగ్ని ప్రమాద సమయంలో పాటించవలసిన చర్యలపై ప్రజలకు వివరంగా సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ సిబ్బంది కృష్ణ కుమార్, గణేష్, దిలీప్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply