ఆగని తాగునీటి చౌర్యం

మిషన్ భగీరథ నల్లాకు అక్రమంగా మోటార్

నామమాత్రపు చర్యలతో నీటి చౌర్యం పునరావృతం
మోటార్లతో గృహవాసులకు ఇబ్బందులు

పరకాల, మే 14 (ఆంధ్రప్రభ): పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో నల్లాల ద్వారా ప్రజలకు అందించే మిషన్ భగీరథ నల్లా నీరు చౌర్యానికి గురవుతుంది. మిషన్ భగీరథ మంచినీటి నల్లాకు అక్రమంగా మోటర్లు బిగించడంతో గృహవాసులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని భూపాలపల్లి రోడ్డు పద్మశాలి వీధిలో గల వినాయక వైన్స్ బిల్లింగ్ కు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉండగా అక్రమంగా అదనపు నీటి కోసం మోటార్ బిగించడం వల్ల సమీప గృహవాసులకు మిషన్ భగీరథ నీరు సరిపడ రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత జనవరి నెల 19వ తేదీన ఇదే విధంగా మంచినీటి చోర్యానికి పాల్పడుతున్న వినాయక వైన్స్ బిల్లింగ్ వున్న నల్లాకు బిగించిన అక్రమ మోటర్ ను మున్సిపల్ దృష్టికి వెళ్లడంతో అధికారులు సిబ్బందిని పంపించి మోటర్ ను స్వాధీన పరుచుకున్నారు. నామ మాత్రపు చర్యలతో మున్సిపల్ అధికారులు సరిపెట్టుకోగా, ఇదే అదనుగా ప్రస్తుతం ఆ బిల్డింగ్ సంధి లోన ఎవరికీ కనబడకుండా మిషన్ భగీరథ నల్లాకు మోటర్ ను బిగించి మంచినీటిని చౌర్యానికి పాల్పడడం జరుగుతుందని, మంచినీటి నల్లాకు మోటర్ ను బిగించి చౌర్యానికి పాల్పడుతున్న వ్యక్తిపై సరైన చర్యలు తీసుకొని కారణంగానే మరల మిషన్ భగీరథ నల్లాకు మోటర్ ను బిగించి నీటిని అక్రమంగా వాడుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా మోటర్లు బిగించడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని, మిషన్ భగీరథ నల్లా కు అక్రమంగా మోటర్లు బిగించిన వారిపై మరోసారి అక్రమంగా మోటారు బిగించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి మంచినీరు సరిపడా వచ్చే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని గృహవాసులు కోరుతున్నారు.

Leave a Reply