కన్నాయిగూడెం మండల సర్పంచుల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండలంలోని 11 గ్రామపంచాయతీల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలిగా పీరీల స్వప్న, ఉపాధ్యక్షుడిగా తిప్పనపల్లి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అంబాల సౌజన్య, కోశాధికారిగా అల్లం అనిత, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సురేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జాడి రాంబాబు, చింత చంద్రయ్య, కుర్సం రమాదేవి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తోటి సర్పంచును శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని సర్పంచులు కార్యక్రమంలో పాల్గొన్నారు.