Collector | బార్లను లాటరీ విధానంతో…

Collector | బార్లను లాటరీ విధానంతో…

  • ఎంపిక చేసిన జాయింట్ కలెక్టర్ నవీన్

Collector | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ఇటీవల జిల్లావ్యాప్తంగా మిగిలిపోయిన 11 బార్ల దరఖాస్తులకు లాటరీ విధానాన్ని నిర్వహించారు. 6 బార్లకు మొత్తం 37 దరఖాస్తులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ గురువారం లాటరీ విధానంతో బార్లను ఎంపిక చేశారు.

మొత్తం 11 బార్లకు 6 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో ఐదు బార్లకు, గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో 1 బారు కు లాటరీ విధానంలో లైసెన్సు లు మంజూరు చేశారు. గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో 4 బార్లకు, పెడన మున్సిపాలిటీ పరిధిలో 1 దరఖాస్తులు రాకపోవటంతో వాటికి లాటరీ విధానంను రద్దు చేశారు..

Leave a Reply