షార్ట్ సర్క్యూట్ తో హోటల్ దగ్ధం..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి పట్టణం నారాయణ స్వామి నగర్ లో ఆదివారం లక్ష్మీ మెస్ హోటల్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ ముందు ఉన్న కట్టెల పందిరి, రేకుల షెడ్డు కాలింది. హోటల్ లో సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు నిర్వాహకుడు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని పరమేశ్వర్ తెలిపాడు. ఆదివారం హోటల్ బంద్ ఉడడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు చుట్టు పక్కలకు వ్యాపించకుండా అదుపు చేశారు.

