ఆత్మీయ పరామర్శ…
ఆత్మీయ పరామర్శ…
అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న శివాలయ చైర్మన్‌కు ఎమ్మెల్యే పరామర్శ
విస్సన్నపేటలో వెంపటి శ్రీకృష్ణ జనార్దన్ రావును కలిసిన కొలికపూడి శ్రీనివాసరావు
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచన
త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్ష
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట పట్టణంలో బ్రెయిన్ ఆపరేషన్ అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విస్సన్నపేట శివాలయం చైర్మన్ వెంపటి శ్రీకృష్ణ జనార్దన్ రావును గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గురువారం వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనార్దన్ రావు ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు సూచించిన జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మనోధైర్యంతో త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండే శ్రీకృష్ణ జనార్దన్ రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని కోరుకున్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
