దుర్గ గుడి ఈవోకు ఐదు రోజుల సెలవు

దుర్గ గుడి ఈవోకు ఐదు రోజుల సెలవు

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి:
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కే. శీనా నాయక్ ఐదు రోజుల పాటు సెలవుపై వెళ్తున్నారు. వ్యక్తిగత, కుటుంబ పనుల నిమిత్తం ఆయన సెలవు తీసుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామానికి వెళ్లనున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆయన సెలవులో ఉంటారని దేవస్థానం వర్గాలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి.

ఈవో శీనా నాయక్ సెలవులో ఉన్న కాలంలో దుర్గా గుడి ఇన్‌చార్జి ఈవోగా అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆలయ దైనందిన కార్యక్రమాలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్‌చార్జి ఈవో పర్యవేక్షించనున్నారు. వేసవి కాలం కావడం వల్ల ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని, భక్తులకు కల్పించే మౌలిక వసతులలో ఎలాంటి లోపాలు రాకుండా చూసుకోవాలని ఆలయ పాలకమండలి సూచించింది.

Leave a Reply