ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలి..
బుట్టాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ జాడి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మిద్దామని సర్పంచ్ జాడి రాంబాబు పేర్కొన్నారు.
