29 వ వార్డులో కాంగ్రెస్ జోరూ

29 వ వార్డులో కాంగ్రెస్ జోరూ

  • ప్రతిపక్షాలు బేజారు
  • దూసుకుపోతున్న రజని
  • గెలుపు ఖాయం అంటున్న ప్రజలు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి పట్టణంలోని 29 వార్డులో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. ప్రతిపక్షాలను వెనక్కి నెట్టి ప్రచారంలో హస్తం పార్టీ ముందు వరుసలో నిలిచింది. చేతి గుర్తు అభ్యర్థి ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి ప్రచారంలో జోరు కొనసాగిస్తుండడంతో ప్రజలు గెలుపు ఖాయం అంటున్నారు. గురువారం వార్డు పరిధిలోని గడపగడపకు వెళ్లి 11వ తేదీన జరిగే పోలింగ్లో చేతి గుర్తుకు ఓటు వేసి తమను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు సహకారంతో 29వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతిపక్షాల నాయకులు ఎన్నికల ముగియగానే కంటికి కనిపించరని, తమకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవలందిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రచారంలో అడుగడుగున రజనీ కృష్ణమూర్తికి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రచార సరళి పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇల్లందుల రజని విజయం ఖాయమంటున్నారు.

Leave a Reply