పల్స్ పోలియో ప్రతి బిడ్డకు రక్షణ కవచం

  • చౌటుప్పల్‌లో విస్తృతంగా పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం
  • మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ఆవరణలో ‘దివిస్’ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిన్నారులకు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సుమన్ కళ్యాణ్ తో కలిసి ఆమె స్వయంగా పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పల్స్ పోలియో ప్రతి బిడ్డకు రక్షణ కవచం లాంటిదన్నారు. చౌటుప్పల్ మండలం, మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాల వ్యాప్తంగా ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఈ చుక్కల మందు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తంగడపల్లి పీహెచ్‌సీ డాక్టర్ చింతకింది కాటంరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. పోలియో కేంద్రాల్లో విధుల్లో ఉన్న హెల్త్ స్టాఫ్‌కు అల్పాహారం, సిబ్బందికి వాహన సదుపాయం, పోలియో వ్యాక్సిన్ బాక్సులను సెంటర్లకు చేరవేయడం వంటి అన్ని సౌకర్యాలను కల్పించిన ‘దివిస్’ సంస్థ యాజమాన్యానికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు.

​సదుపాయాలు కల్పించాం దివిస్ మేనేజర్ బి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలం, మున్సిపల్ పరిధిలోని అన్ని కేంద్రాలలో పల్స్ పోలియో కార్యక్రమం సజావుగా సాగేందుకు తమ సంస్థ తరఫున అవసరమైన అన్ని సామాగ్రిని, రవాణా సౌకర్యాలను సమకూర్చినట్లు వివరించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోసిక వినయ్, స్థానిక కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పాక చిరంజీవి, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, ఎండి హన్ను, చింతల ఉమామహేశ్వరి సాయిలు,, బత్తుల జయమ్మ దాస్, దివిస్ ప్రతినిధులు బి. గోపి, జి. వెంకటేశ్వర్లు, వి. వంశీకృష్ణ, జె. శివకృష్ణ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చౌటుప్పల్ మండలంలో…
చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామాలలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికీ ఆయా గ్రామాల సర్పంచులు రెండు చుక్కలు పోలియో డ్రాప్స్ వేసి కార్యక్రమాలను ప్రారంభించారు. రెండు మల్కాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్, మందోళ్లగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ తంగెళ్ల వెంకటేశం, ఆరెగూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి, కొయ్యలగూడెం గ్రామములో సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, ఎస్ లింగోటం గ్రామంలో గ్రామ సర్పంచ్ భీమిడి ప్రదీప్ జీ, అంకిరెడ్డిగూడెం గ్రామంలో సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్, నేలపట్ల గ్రామంలో సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్, కుంట్లగూడెం గ్రామంలో సర్పంచ్ అన్యాలపు నరేష్, జైకేసారం గ్రామంలో సర్పంచ్ సమిరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డి, పెద్ద కొండూరులో సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్, పంతంగి గ్రామంలో సర్పంచ్ కాకి శ్రీలత సుందర్, తూఫ్రాన్ పేట గ్రామంలో సర్పంచ్ రాధిక తదితరులు చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేసి గ్రామాలలో కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.