ఘనంగా పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో2000-,2001 ఏడాది పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుకభరత్, ఉప సర్పంచ్ ఆర్. రమేష్ హాజరై మాట్లాడారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన విశ్రాంత బి హెచ్ ఎం ఆసిరెడ్డి, వెంకట్ రాములు గౌడ్లను ఘనంగా సన్మానించి ఆశీస్సులు పొందారు.

ఒకే తరగతి గదిలో పదో తరగతి వరకు చదువుకొని కొన్ని సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న స్నేహితులు అలనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని సంతోషంగా సరదాగా గడిపారు. స్నేహానికి ఉన్న మధురమైన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరుపుకున్నారు. తాము చదువుకున్న పాఠశాలకు బీరువాను వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో భాస్కర్, పాండు, కావలి సురేష్ , తాయప్ప ,వెంకటేష్, నరేందర్,రాఘవేంద్ర, రామకృష్ణ, భీమ్ శంకర్ గౌడ్,అశోక్ కుమార్, రమేష్, నవీన్ కుమార్, శంకర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.