7500 Crores | అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం

7500 Crores | అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
7500 Crores | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే10న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ర్టంలో రూ.7,500 కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే రైల్వేస్టేషన్లను జాతికి అంకితమిస్తారని చెప్పారు. అదేవిధంగా జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. ప్రధాని రాక సందర్భంగా లక్ష మందితో పరేడ్ గ్రౌండ్స్ లో సభ పెట్టేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసే చాన్స్ ఉంది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ట్రెయిన్ పొడిగింపు పనులకు, వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులకు కూడా ఆయన భూమిపూజ చేసే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదటి దశ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ పనులను ప్రారంభించి జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. బీబీనగర్ ఎయిమ్స్, కాజీపేట వర్క్ స్టేషన్ తదితర వాటినీ ప్రారంభించే చాన్స్ ఉంది.
