చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం

చిట్యాల, ఆంధ్రప్రభ ; వేసవిలో ప్రజలు దాహార్తి తీర్చడానికి ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని మాజీ సర్పంచ్ జిట్ట నగేష్ తెలిపారు. ఆదివారం నాడు నల్లగొండ జిల్లా నకరికల్లు నియోజకవర్గం చిట్యాల పట్టణ కేంద్రంలో సాయి భవాని కృష్ణ ఈకో మోటార్స్ బైక్ షో రూం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆదివారం నాడు మాజీ సర్పంచ్ జిట్ట నగేష్ ప్రారంభించారు.
స్థానిక భువనగిరి రోడ్డు కు గల ఎలక్ట్రికలు బైక్ షో రూం సమీపంలో యజమాని బొడ్డు బాబురావు ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన బాబురావు ను అభినందించారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కెవిపియస్ మండల నాయకులు గాదె ఎల్లేష్, బందెల రాములు, జిల్లాల గోవర్ధన్,పాలు రమేష్, మేకల రాములు,బైరబోయిన నర్సింహా, మేడిపల్లి శివ,సిలివేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
