బాధిత కుటుంబానికి పరుపాటి చేయూత
బాధిత కుటుంబానికి పరుపాటి చేయూత
- ఆపన్నులకు అండగా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్
- ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి, ఆంధ్రప్రభ :‘ సేవే లక్ష్యం, నిరుపేదలకు అన్నగా నిలవడమే ధ్యేయం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మండలంలోని గన్నారం గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయం అందించారు.
గన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మునిగిల ఉప్పలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా, విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి నేరుగా ఉప్పలయ్య ఇంటికి వెళ్ళి,మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఉప్పలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ అందించారు. “కష్టకాలంలో ధైర్యంగా ఉండండి. మీకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.
ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఐత రామ్ చందర్, చిలువేరు సాయి గౌడ్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, స్థానిక సర్పంచ్ గడ్డం విజయ సమ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు ఊళ్లేంగాల సుధాకర్, మాజీ సర్పంచ్ కుక్కల భాస్కర్, ముఖ్య నాయకులు గజేందర్ రెడ్డి, ఎండీ రంజాన్, నందనబోయిన సాంబశివ, బొంద్యాలు, గడ్డం సునీల్, ఈరెల్లి బాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
