5 వార్డు లో బండ్రు శోభారాణి ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 5 వ వార్డు లో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చింతకింది మురళి తరఫున శనివారం ప్రచార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆ వార్డులోని బీడీ కార్మికులను కలిసి కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
