మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి ఆదరణ

ఆలేరు, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ప్రభావాన్ని చూపుతాయని ఆ పార్టీ యువజన విభాగం నాయకులు మంగళపల్లి ఎల్లేష్ శనివారం చెప్పారు. కేంద్రం అందిస్తున్న పథకాలు ఎంతోమంది లబ్ధిదారులకు గతం నుండి ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలకు కృషి తెలుపు తోడ్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.