ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో కలిసి చౌటుప్పల్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన బోయ దేవేందర్, చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన కాసర్ల శ్రీనివాస్ రెడ్డి లు హైదరాబాదులోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కంకణ బద్ధులమై పనిచేస్తామన్నారు. పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుబ్బాక ఆకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
