తండ్రి లేని యువతి పెళ్లికి ఎమ్మెల్యే అండ

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన షాహిదా భర్తను కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ పోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఈ క్రమంలో తన కుమార్తె వివాహం నిర్వహించేందుకు ఆర్థిక సహాయం కోసం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.1,00,000 ఆర్థిక సహాయం మంజూరు చేశారు.

ఈ మేరకు చెక్కును మునుగోడు పట్టణ నాయకులు పెళ్లి కూతురుకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్,మాజీ సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు పాల్వాయి జితేందర్ రెడ్డి,సాగర్ల లింగస్వామి, ఎండి అన్వర్,వల్లంచెట్ల రవి,దుబ్బ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply