టీడీపీ యాప్‌లో 551 కుటుంబాల నమోదు
అజాద్‌కు ఎమ్మెల్యే తాతయ్య సత్కారం
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా టీడీపీ యాప్ ద్వారా అత్యల్ప సమయంలో 551 కుటుంబ సభ్యుల నమోదును పూర్తి చేసిన 171వ వార్డు కన్వీనర్ మహమ్మద్ అజాద్‌ను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా సత్కరించారు.
మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అజాద్‌కు శాలువా కప్పి అభినందించారు. ఇదే సందర్భంగా కో-కన్వీనర్ చింతల పాండవులును కూడా శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు కర్ల నాగేశ్వరరావు, చుంచు రమేష్‌బాబు, మాజీ జెడ్పీటీసీ గజ్జి కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్‌బాబు, మాదినేని వెంకట్రావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
