విద్యార్థులకు ఉపయోగకరంగా పౌర గ్రంథాలయాలు..

విద్యార్థులకు ఉపయోగకరంగా పౌర గ్రంథాలయాలు..

ఠాగూర్ గ్రంధాలయాన్ని అభివృద్ధి చేస్తాం..
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.
గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులకు శ్రీకారం
ఎంపీ చిన్ని చేతుల మీదుగా ప్రారంభం

విజయవాడ, ఆంధ్రప్రభ : విద్యార్థుల మేధోసంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాగూర్ గ్రంథాలయం నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్ లోని కాకాని భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులకు నాంది పలికారు.ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు.

ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక, మానసిక, సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా రీనోవేషన్ చేపడతానని హామీ ఇచ్చారు.

చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. గ్రంథాలయంలో ఉన్న పలు పుస్తకాలను పరిశీలించిన అక్కడికి వచ్చిన పాఠకులతో ముచ్చటించారు. గ్రంథాలయ సభ్యత్వాన్ని కూడా ఎంపీ కేసినేని చిన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply