3cars crash| భారీగా ట్రాఫిక్ జామ్
3cars crash| భారీగా ట్రాఫిక్ జామ్
3cars crash | హైదరాబాద్, ఆంధ్రప్రభ : మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ఘటన హైదరాబాద్ (Hyderabad) లోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 253 వద్ద ఒకదానినొకటి మూడు కార్లు (Three cars) ఢీకొన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
3cars crash |వాహనదారులు తీవ్ర ఇబ్బందులు
ఉప్పర్‌పల్లి నుంచి ఆరాంఘర్ చౌరస్తా (Aramgarh Crossroads) వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.


