3,000 fine | మైనర్ బైక్ రైడింగ్‌పై చర్యలు

3,000 fine | మైనర్ బైక్ రైడింగ్‌పై చర్యలు
- 17ఏళ్ల యువకుడికి 3 వేలు ఫైన్, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్
- మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధం, తల్లిదండ్రులు శిక్షార్వులు
- అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్
3,000 fine | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో మైనర్ల చేత బైక్ రైడింగ్(Bike riding)ను అరికట్టేందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని లింగాల చౌరస్తాలో బైకుపై నలుగురు రైడ్ చేస్తూ పట్టుబడిన 17 ఏళ్ల ఇరగోటి శివకుమార్(17-year-old Iragoti Shivakumar)పై రూ.3,000 జరిమానా విధిస్తూ, అతని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్టు అచ్చంపేట ఎస్సై కె. సద్దాం హుస్సేన్(K. Saddam Hussain) ఈ రోజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధం. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులపైనే కేసులు నమోదు చేయబడతాయి అని తెలిపారు. ద్విచక్రవాహనం(two-wheeler)పై ముగ్గురు, నలుగురు ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమన్నారు. బైక్ అదుపుతప్పిన పక్షంలో పిల్లలకు ఏమైనా జరిగితే తల్లిదండ్రులకే జీవితాంతం బాధ మిగులుతుంది” అని స్పష్టం చేశారు.

అచ్చంపేట పట్టణంలో మైనర్ డ్రైవింగ్(minor driving)ను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై హెచ్చరించారు.
