Sarpanch | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ మహిళకు రావడంతో ఉట్నూర్ మాజీ జెడ్పీటీసీ చారులత రాథోడ్, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో దిగారు. ఆమె ఉట్నూర్ సర్పంచ్ గా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. మాజీ జెడ్పీటీసీగా టీఆర్ఎస్ నాయకురాలుగా కొనసాగుతున్నారు. జెడ్పీటీసీగా ఉండి సర్పంచ్ గా పోటీ చేయడంతో చర్చనీయాంశంగా మారుతుంది.
11 సంవత్సరాల తర్వాత ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీకి సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక రావడంతో ఈసారి పోటీ కూడా ఎక్కువ నెలకొంది. ఇప్పటికే 9మంది సర్పంచ్ పోటీకి నామినేషన్ వేసినట్లు అధికార వర్గాల తెలిసింది. రెండు నెలల క్రితం సర్పంచి ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ ప్రకటించగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారంగా ఎన్నికల నిర్వహణ సరికాదని కోర్టు రద్దు చేసింది అప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లు ప్రకారంగా ఉట్నూర్ జెడ్పీటీసీ స్థానం బీసీకి కేటాయించడంతో మళ్లీ ఈసారి జెడ్పీటీసీ, ఎస్టీ రిజర్వేషన్ వస్తుందో లేదో అని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా బరిలో దిగినట్లు ఆమె అనుచరుల ద్వారా తెలిసింది.

