3 Us Officials Dismissed : అమెరికా ఆర్మీ చీఫ్ ఔట్ Andhra Prabha Insight Story
3 Us Officials Dismissed : అమెరికా ఆర్మీ చీఫ్ ఔట్ Andhra Prabha Insight Story
- తెరమీదకు కొత్త కట్టప్ప
- పెంటగాన్‌లో ప్రక్షాళన..
- ట్రంప్ వార్ స్ట్రాటజీ ఎఫెక్ట్.
- సైన్యంలో అలజడి
( ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్్ ఎథిక్ పూరీ.. అమెరికా సైన్యం .. దళపతులు.. రథులు, అతిరథులు, మహారథుల చావుకొచ్చింది. టామ్ అండ్ జెర్రీ గేమ్ లో చిట్టెలుక రీతిలో ఇరాన్ చెలరేగిపోతుంటే… అమెరికా పైకి భౌభౌ అని అరుస్తునే .. ఏకాంతంగా కుయ్యో మొర్రో అనే స్థితి ఏర్పడిన క్షణాలో…. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జియో కెంట్ స్వచ్ఛందంగా తన బాధ్యతల నుంచి వైదొలిగారు.. తాజాగా అమెరికా సైన్యాధిపతి జనరల్ రాండీ జార్జ్ బాధ్యతలను ప్రభుత్వమే గుంజుకుంది. మరో ఇద్దరు అధికారులను మర్యాదగా సాగనంపింది. తాజాగా కొత్త కట్టప్ప ఆరంగేట్రం చేశారు. ఇంతకీ అమెరికా సైన్యంలో ప్రక్షాళన ఎందుకు జరుగుతోంది. తెరమీదకు వస్తున్న కట్టప్పలు.. కోవర్టుల సంగతేంటీ?
3 Us Officials Dismissed అకస్మిక ప్రక్షాళన

అమెరికా అధ్యక్షుడి హితుడు.. సన్నిహితుడు.. రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ .. అకస్మిక వ్యూహం ఏమిటీ? ప్రపంచ దేశాలను చిచ్చు పోయించే అమెరికా పెద్దన చేతిలో.. బాహుబలి అస్త్రం. ఔను అమెరికా సైన్యం కదిలిందంటే.. దేశాలన్నీ గజగజలాడాల్సిందే. ఏ విమానం బాంబుల వర్షం కురిపిస్తుందో.. అర్థం కాని స్థితి. అలాంటి మేటి అమెరికా సైనిక బలం..బలగం . ప్రస్తుతం ఇరాన్ గులకరాళ్ల దెబ్బతో పిట్లల్లా టపటపా ఎందుకు రాలుతోంది. గెలిస్తే అధ్యక్షుడు సామర్థ్యం.. ఓడితే సైన్యాధిపతి అసమర్థత కారణం అనే ఉక్రోశం .. తాజా అమెరికా పరిణామాల్లో వ్య క్త మవుతుంటే.. ఇక అమెరికా సైన్యంలో అసమ్మతి సెగ రగులుతున్న స్థితి గతి.. అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఖాయమని విశ్లేషకుల అంచనా.
3 Us Officials Dismissed అనధికార ఉద్వాసన

అమెరికా సైన్యాధిపతి జనరల్ రాండీ జార్జ్‌ను తక్షణమే పదవీ విరమణ చేయాలని రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించారు. జనరల్ రాండీ జార్జ్ సైన్యాధిపతి విరమణను పెంటగాన్ ముఖ్య అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ గురువారం ధృవీకరించారు, “జనరల్ రాండీ ఎ. జార్జ్ 41వ సైన్యాధిపతి పదవి నుంచి తక్షణమే వైదొలుగుతున్నారు. దేశానికి దశాబ్దాలుగా జనరల్ జార్జ్ చేసిన సేవకు యుద్ధ శాఖ కృతజ్ఞతలు తెలుపుతోంది” అని వ్యాఖ్యానించారు. .
3 Us Officials Dismissed : అందరికీ ముందే తెలుసు

సైన్యాధిపతి రాండీ జార్జ్ పదవీత్యుచుడు కాబోతున్నట్టు అంతర్జాతీయ మీడియా ముందుగానే పసిగట్టింది. ఈ వార్తా కథనాలు జమేనని రక్షణ శాఖ ధృవీకరించింది. ఈ ఆకస్మిక ప్రకటనతో సైన్యంలోని ఉన్నత నాయకత్వం అవాక్కైంది. రాండీ జార్జ్‌ను బలవంతంగా తొలగిస్తున్న విషయం బహిరంగంగా ప్రకటించినప్పుడు మాత్రమే సైనిక అధికారులకు తెలిసింది, రాండీ జార్జ్ గురువారం ఒక సమావేశంలో ఉండగా, హెగ్సెత్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. సైన్యాధిపతి పదవి నుంచి వైదొలగాని ఆదేశించారు. ఈ విషయాన్ని రాండీ జార్జ్ తన సిబ్బందికి స్వయంగా చెప్పారు. ఈ అకస్మిక ఆ వార్త విన్నప్పుడు ఆయన సిబ్బంది “చాలా నిబ్బరంగా” ఉన్నారని ఓ అధికారి చెప్పారు. ఇరాన్ యుద్ధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఒక రోజు తర్వాత హెగ్సెత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రసంగంలో, రెండు మూడు వారాల్లో అమెరికా ఈ యుద్ధాన్ని ముగించవచ్చని గతంలో సూచించిన ట్రంప్, ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని సంకేతం ఇచ్చారు.
3 Us Officials Dismissed : అతండంటే… భయం

ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్‌తో ఆర్మీ చీఫ్ జార్జ్ సన్నిహితంగా పనిచేశారు వైట్ హౌస్‌కు అత్యంత సన్నిహితుడు జార్జి వ్యవహరించారు. అందుకే ఈ సీనియర్ అధికారి ఒక ముప్పుగా హెగ్సెత్ భావించారు కొన్నిసార్లు ఆయనతో వివాదాస్పద వ్యవహరించారు. ఆకస్మికంగా బహిరంగంగా జార్జ్ తక్షణ పదవీ విరమణ ప్రకటన వెలువడటంతో, ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న తరుణంలో జాయింట్ చీఫ్‌లలో ఒకరిని తొలగించడాన్ని అధికారులు వ్యతిరేకించలేదు. ఇందుకు పెద్దగా ఆస్కారం లేదు, ప్రత్యేకించి సైన్యం, బలగాలను మోహరిస్తూ, జాయింట్ ఫోర్స్‌కు కీలక సమీకృత వాయు క్షిపణి రక్షణ సామర్థ్యాలను అందించే ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో జార్జ్ తొలగింపు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ , హెగ్సెత్‌లకు ఆర్మీఛీప్ గా జార్జ్ సలహాలు, మార్గదర్శకత్వం అందించారు.”ఇది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయంలా అనిపించడం లేదు,” అని ఓ యూఎస్ అధికారి అన్నారు.
3 Us Officials Dismissed : అందుకే .. అక్కసు
పదాతిదళపతి రాండీ జార్జ్, 1988లో వెస్ట్ పాయింట్‌లోని యూఎస్ మిలిటరీ అకాడమీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. . ఆయన సెప్టెంబర్ 2023 నుండి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆయన జాయింట్ బేస్ లూయిస్- మెక్‌కార్డ్‌లో ఐ కార్ప్స్‌కు కమాండర్‌గా పనిచేశారు, బైడెన్ పరిపాలనలో రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌కు సీనియర్ మిలిటరీ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. రక్షణ కార్యదర్శికి సీనియర్ మిలిటరీ అసిస్టెంట్ పదవిని తరచుగా రాజకీయాలకు అతీతమైనదిగా అత్యుత్తమ సైనిక అధికారులకు ఇచ్చే పాత్రగా పరిగణిస్తున్నప్పటికీ, జార్జ్‌కు ఆస్టిన్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని హెగ్సెత్ , వర్గం ఒక ప్రతికూల అంశంగా పరిగణించింది.
3 Us Officials Dismissed : మరో ఇద్దరికి ఉద్వాసన
ఒకే రోజు ముగ్గురు కీలక సైనిక అధికారులను అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తొలగించారు. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ చాప్లిన్స్ మేజర్ జనరల్ విలియం గ్రీన్ జూనియర్ , ఆర్మీ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ట్రైనింగ్ కమాండ్, కమాండింగ్ జనరల్‌గా జనరల్ డేవిడ్ హోడ్నేను తొలగించారు. ఈ ఉద్వాసనలకు రక్షణ శాఖ ఎటువంటి అధికారిక కారణాన్ని వెల్లడించలేదు. ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి కీలక అధికారులను తొలగించడం అమెరికా సైనిక చరిత్రలో చాలా అరుదైన విషయంగా భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు హెగ్సెత్ దాదాపు 13 మందికి పైగా ఉన్నత స్థాయి జనరల్స్, అడ్మిరల్స్‌ను తొలగించారు.
3 Us Officials Dismissed : తెరమీదకు జనరల్ లానెవ్

తన సీనియర్ మిలిటరీ అసిస్టెంట్ జనరల్ క్రిస్టఫర్ లానెవ్‌ను ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నామినేట్ చేశారు. అతను చివరికి జార్జ్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారని పెంటగాన్ సైనిక అధికారుల్లో ఊహాగానాలు చెలరేగాయి. అందరూ ఊహించినట్టే రాండీ జార్జ్ గైర్హాజరీతో చేపట్టారు. అమెరికా తాజా తాత్కాలిక ఆర్మీ ఛీప్ లానెవ్ అరిజోనా విశ్వవిద్యాలయం ROTC నుంచి పట్టా పొందిన తర్వాత 1990 లో అమెరికా ఆర్మీలో చేరారు. నార్త్ కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్‌లో 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ కమాండర్‌గా పనిచేశారు. 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండర్ గా విధులు నిర్వహిస్తుండగా రెండేళ్లలోపే కమాండర్ పదవి నుంచి దక్షిణ కొరియాకు వెళ్లున్న యూఎస్ ఆర్మీ ఫోర్సెస్ కమాండ్ కమాండర్ ప్రత్యేక సహాయకుడిగా లావెన్ పదోన్నతి పొండారు.
3 Us Officials Dismissed : అంతా అతడే ..

అమెరికా సైన్యాన్ని వశం చేసుకోవటమే ప్రధాన లక్ష్యంగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఆయన అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత నమ్మకస్తుడు . ట్రంప్ “అమెరికా ఫస్ట్ , “పీస్ థ్రూ స్ట్రెంత్” విధానాలను అమలు చేయడంలో పీట్ ముందున్నారు. ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టాలని ప్రతిపాదించిన తొలి సీనియర్ అధికారి హెగ్సెత్ అని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుత ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ప్రధాన ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఆదేశాల మేరకు హెగ్సెత్ తనను తాను “సెక్రటరీ ఆఫ్ వార్ష పిలుచుకుంటున్నారు, ఇది సైన్యం యుద్ధ సంస్కృతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఉంది. సైన్యంలో అతివాద, ఉదారవాద ధోరణులను తొలగించి, కేవలం యుద్ధ సన్నద్ధతపైనే దృష్టి పెట్టాలని ఆయన కఠిన న నిర్ణయాలు తీసుకుంటున్నారు.
3 Us Officials Dismissed : జీహుజూర్ కే పెద్ద పీట

పీట్ హెగ్సెత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా సైన్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రక్షాళన జరుగుతోంది. ట్రంప్ హెగ్సెత్ “వార్ టైమ్ స్ట్రాటజీ”ని ఎటువంటి ప్రశ్నలు లేకుండా అమలు చేసే “ఎస్-మెన్” (అనుకూల వ్యక్తులు) కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. జనరల్ రాండీ జార్జ్ స్థానంలో జనరల్ క్రిస్టోఫర్ లానెవ్ తాత్కాలిక ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో హెగ్సెత్‌కు వ్యక్తిగత మిలిటరీ అసిస్టెంట్‌గా పనిచేశారు, అందుకే ఈయనపై హెగ్సెత్‌కు పూర్తి నమ్మకం ఉంది.
3 Us Officials Dismissed : సైన్యంలో వ్యతిరేకత

అర్హులైన నల్లజాతీయులు, మహిళా అధికారుల పదోన్నతులను హెగ్సెత్ అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది సైన్యంలోని మెరిట్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని విమర్శకులు అంటున్నారు. ఇరాన్ యుద్ధాన్ని మతపర యుద్ధంగా అభివర్ణిస్తున్నారని వందలాది మంది సైనికులు ఫిర్యాదు చేయడంతో, 28 మంది డెమొక్రాటిక్ ఎంపీలు విచారణకు డిమాండ్ చేశారు.ఈ ఆకస్మిక మార్పులు ప్రక్షాళన చర్యలతో సైన్యంలో వ్యతిరేకత గందరగోళం ఏర్పడింది. హెగ్సెత్ చర్యలతో సైన్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.సైన్యం స్వతంత్రతను దెబ్బతీసి, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ అధికారులను పక్కన పెట్టి తన సన్నిహితులకు పదవులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. యుద్ధాన్ని మతపరమైన కోణంలో వర్ణించడంపై కొందరు డెమొక్రాటిక్ ఎంపీలు , సైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.వరుస తొలగింపులు, వివాదాస్పద నిర్ణయాల వల్ల సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ : Trump Cofusion : ఆపరేషన్ సక్సెస్.. బట్.. Andhra Prabha SPL Story
