బేతానియా ఫెలో షిప్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రం లో గల బేతానియా ఫెలో షిప్ చర్చ్ లో శుక్రవారం క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు క్రీస్తు ను స్తుతిస్తూ భక్తి గీతలు ఆలపించారు. చర్చ్ పాస్టర్ తిమితి రాజు ఆద్వర్యం లో చర్చ్ లో గుడ్ ఫ్రైడే సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మండలం లోని పలు గ్రామాల నుండి తరలివచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.