ఇసుక, రబ్బిష్ కు అడ్డగా మారిన సి.వి.ఆర్ ఫ్లైఓవర్..

ఇసుక, రబ్బిష్ కు అడ్డగా మారిన సి.వి.ఆర్ ఫ్లైఓవర్..

ఇసుక, రబ్బిష్ లోడ్ల ను ఫ్లైఓవర్ క్రింద ఉంచి అమ్మకాలు..
ఫ్లైఓవర్ సర్వీస్ లో ట్రాఫిక్ కు ఇబ్బంది గా మారి వ్యాపారం..
చోద్యం చూస్తున్న పోలీసులు..

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 46, 45 డివిజన్లు పరిధిలో ఉన్న చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ ఇసుక రబ్బిష్ లకు అడ్డగా మారింది. సోమవారం ఉదయం ట్రాక్టర్లోకి ఇసుక లోడ్ అవుతోంది. ట్రాక్టర్ ఇసుక 3 వేలు, అర ట్రాక్టర్ 18 వందలు పలుకుతుంది అని అంటున్నారు. అసలు ఇక్కడ ఇసుక ఎందుకు ఉంది అని ఆంధ్రప్రభ వివరణ అడుగగా ఇసుక ట్రాక్టర్ తిరగబడి అని చెబుతున్నారు.

నిజానికి ఇసుక ట్రాక్టర్ తిరిగి బడితే అది రోడ్డు మధ్యలో ఇసుక పడుతుంది కానీ ఫ్లైఓవర్ క్రింద అది కూడా ఒక మూల గా పడదు కదా. అది కాక ఒక ట్రాక్టర్ తిరిగి బడితే ఒక ట్రాక్టర్ ఇసుక ఉండాలి కాని అక్కడ ఒక ట్రాక్టర్ కంటే ఎక్కువ ఇసుక మేట ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచో రబ్బిష్ మెటీరియల్ గుట్టలు గుట్టలుగా పోసి అవసరం ఉన్న వారికి ట్రాక్టర్లు కు ఎత్తి అమ్ముతారు.

ఇప్పుడు రబ్బిష్ కు ఇసుక కూడా తోడైంది. అసలే సి.వి.ఆర్ ఫ్లైఓవర్ క్రింద మూడు వైపులా ట్రాఫిక్ ఉంటుంది. చిట్టినగర్ నుండి కబేళ వైపు కు వెళ్ళే ద్విచక్ర వాహనాల ఆటోలు, అలాగే చిట్టి నగర్ సెంటర్ నుండి వైయస్సార్ కాలనీ వైపు వెళ్లే సి.వి.ఆర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాలు ,కబేళ వైపు నుండి చిట్టినగర్ సెంటర్ కు వెళ్ళే ద్విచక్ర వాహనాల ఆటోలు రాకపోకలతో చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. ఇదే ప్రాంతంలో ఒక దేవాలయం నిర్మాణం లో ఉంది, దాని నిర్మాణం కోసం తెచ్చిన ఇసుక కంకరు వంటి సామగ్రి రోడ్డు మీద ఉంటుంది.

దానికి తోడు ఇప్పుడు రబ్బిష్ ఇసుక వంటి వాటిని పెట్టి అమ్మకాలు సాగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇంత రద్దీగా సి.వి.ఆర్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు ప్రాంతం లో ఇసుక రబ్బిష్ వంటివి లేకుండా పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply