కె.ఎల్.రావు స్విమ్మింగ్ ఫూల్‌లో వేసవి శిక్షణా తరగతులు…

కె.ఎల్.రావు స్విమ్మింగ్ ఫూల్‌లో వేసవి శిక్షణా తరగతులు…
మే ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు శిక్షణ
చిట్టినగర్, ఆంధ్రప్రభ : వేసవి కాలంలో విద్యార్థులకు చిన్నారులకు ఆటవిడుపుగా అనేక రకాల శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విజయవాడ నగర పాలక సంస్థ అనేక రకాలైన వేసవి శిక్షణ తరగతులు మే ఒకటవ తేదీ నుండి మే ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహిస్తుంది. చిన్న పిల్లలు, విద్యార్థులు వేసవి లో చల్లగా ఉండే ఈత అంటే చాలా ఉత్సాహం చూపిస్తారు. ఇటీవల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వేసవిలో ఏదో ఒక రకమైన శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఎక్కువ మంది ఈత శిక్షణ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ డాక్టర్ కె.ఎల్ రావు స్విమ్మింగ్ పూల్ లో కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఈత కు సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. 8 సంవత్సరాల వయస్సు నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వేయి రూపాయల ఫీజు ఉంటుంది.
ఈ స్విమ్మింగ్ ఫూల్ లో వేసవి శిక్షణా తరగతుల్లో భాగం గా ప్రతి రోజూ ఉదయం 7 గం ల నుండి 9 గం వరకు రెండు బ్యాచ్ లకు అలాగే సాయింత్రం 5గం. ల నుండి 7గం. ల వరకు రెండు బ్యాచ్ లకు గంట పాటు విద్యార్థులకు స్విమ్మింగ్ ఫూల్ కోచ్ రఫీ ఈత కు సంబంధించిన తర్ఫీదు ఇస్తారు అని తెలిపారు. ఈ స్విమ్మింగ్ ఫూల్ లో తర్ఫీదు పొందిన విద్యార్థులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈత పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఉత్సాహవంతులైన వారు రేపటి నుండి ప్రారంభమైయ్యే సమ్మర్ స్విమ్మింగ్ లో జాయిన్ అవ్వాలి అని కోచ్ రఫీ కోరారు.
