11am to 4pm | ఉదయం ఎనిమిది దాటిందంటే చాలు…బయటికెళ్ళాలంటే భయమే.

11am to 4pm | ఉదయం ఎనిమిది దాటిందంటే చాలు…బయటికెళ్ళాలంటే భయమే.

11am to 4pm | ఎండ తీవ్రతపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన
వడదెబ్బ నుంచి కాపాడే ముఖ్యమైన జాగ్రత్తలు
శరీరంలో నీటి శాతం తగ్గకుండా తీసుకోవాల్సిన చర్యలు
పిల్లలు, వృద్ధులు తప్పక పాటించాల్సిన సూచనలు
వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చేయాల్సినవి
అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది.

11am to 4pm | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : నిప్పులు కురుస్తున్న ఎండల్లో తప్పనిసరై బయట తిరగాలంటే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవ్.
వడదెబ్బ బారి నుండి రక్షించుకోవడానికిజాగ్రత్తలు మీకోసమే.

మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలి.
బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, గుడ్డ లేదా గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలి.
తరచూ చల్లని నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.
తెలుపు లేదా లైట్ కలర్ కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు. పండ్లు, తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువసేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త పడాలి.
వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడ ప్రాంతానికి వెళ్లి నీరు తాగాలి. అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తలనొప్పి, అధిక చెమటలు, వాంతులు, అలసట, తల తిరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.
వాహనాల్లో చిన్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టడం ప్రమాదకరం.
శరీరం చల్లగా ఉండేందుకు తరచూ ముఖం, చేతులు కడుక్కోవడం మంచిది.
బయటకు వెళ్లేముందు ఓఆర్‌ఎస్‌, గ్లూకోజ్ నీరు తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది.
రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ అధికంగా తీసుకోవడం డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.
ఎండలో పని చేసే కార్మికులు గంటకొకసారి నీడలో విశ్రాంతి తీసుకోవాలి.
ఇంట్లో కూడా గదులు చల్లగా ఉండేలా కిటికీలు తెరిచి గాలి వచ్చేలా చూడాలి.
శరీరంలో నీరసం, పెదాలు ఎండిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వడదెబ్బ హెచ్చరికలుగా భావించాలి.
పిల్లలకు ఐస్‌క్రీములు కంటే పండ్లరసాలు, మజ్జిగ ఇవ్వడం మంచిది.
బయట కొనుగోలు చేసే కట్‌ ఫ్రూట్స్‌, నిల్వ నీళ్లు తాగకుండా జాగ్రత్తపడాలి.
వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెంటనే చల్లటి ప్రదేశంలో విశ్రాంతి కల్పించాలి.
అవసరమైతే తడి గుడ్డతో శరీరాన్ని తుడవడం ద్వారా వేడి తగ్గించవచ్చు.

11am to 4pm

CLICK HERE TO READ 41-44 degrees | తెలంగాణ‌లో వచ్చే ఐదు రోజులు భగభగలే..

CLICK HERE TO READ MORE