Bangladesh | Tarique Rahman| బంగ్లాదేశ్‌లో మారుతున్నరాజకీయ పరిస్థితులు
Bangladesh | Tarique Rahman| బంగ్లాదేశ్‌లో మారుతున్నరాజకీయ పరిస్థితులు
- సాధారణ ఎన్నికలకు తేదీ ఖరారు
- స్వదేశంలో అడుగుపెట్టిన మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు
- 17 ఏళ్ల తర్వాత వచ్చిన తారిక్ రెహమాన్ ఘన స్వాగతం
Bangladesh | Tarique Rahman| వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ ఈ రోజు ఉదయం ఢాకాలో అడుగుపెట్టారు. 17 ఏళ్ల తర్వాత వచ్చిన ఆయనకు ఢాకా విమానాశ్రయంలో బీఎన్పీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కాలంలో అట్టుడికిపోతున్నబంగ్లాదేశ్లో ఎన్నికల ప్రకటన తర్వాత ఆయన అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ దేశంలోకి రాజకీయ పరిస్థితులు మారుతాయా? అనేది ఆ దేశం ప్రజలతోపాటు ప్రపంచ దేశాలు కూడా చర్చించుకుంటన్నాయి.
Bangladesh | Tarique Rahman| సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు
జాతీయ సంసద్ సభ్యులను (Jatiyo Sangsad Members) ను హౌస్ ఆఫ్ ది నేషన్ (House of the Nation) అని కూడా పిలుస్తారు. ఎన్నుకోవడానికి బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు 2026 ఫిబ్రవరి 12న జరగనున్నాయి. గత నాలుగు ఎన్నికలలో విజేతగా నిలిచిన అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. ముఖ్యంగా నేషనల్ సిటిజన్ పార్టీ (NCP), బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) పోటీ చేయనున్నాయి. జాతీయ సంసద్లోని 350 మంది సభ్యులు ఏక సభ్య నియోజకవర్గాలలో మొదటి-స్థాన-పోస్ట్ ఓటింగ్ ఉపయోగించి ప్రత్యక్షంగా ఎన్నికైన 300 స్థానాలను, మహిళలకు అదనంగా 50 స్థానాలను కలిగి ఉంటారు. రి బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఈ ఎన్నికల్లో 127,695,183 మంది ఓటు వేయడానికి అర్హులు. వారిలో 64,814,907 మంది పురుషులు, 62,879,042 మంది మహిళలు, 1,234 మంది మూడవ లింగ ఓటర్లు.
Bangladesh | Tarique Rahman| తారిక్ రెహమన్ ప్రస్థానం…
బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని ఖాలిదా జియా (Khaleda Zia) కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ (Tarique Rahman). తారిఖ్ రహ్మాన్ 2008లో కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్లారు. 18 నెలలు జైలులో ఉన్న తర్వాత, 2008 సెప్టెంబర్ 3న విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన యూకేలో ఆశ్రయం పొందారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని రేసులో తారిక్ ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తల్లి ఖాలిదా జియా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మళ్లీ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టారు.
Bangladesh | Tarique Rahman| వేడిక్కిన రాజకీయాలు
బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇంతవరకు అల్లర్లతో అట్టుడికిపోయిన బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల ప్రచారంలోనే భారత వ్యతిరేకి విద్యార్థి నేత హతమయ్యాడు. మాజీ ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రహ్మాన్ రాకతో రాజకీయాల్లో కీలక మలుపు రానుంది. ‘ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, ముందు బంగ్లాదేశ్’ అంటూ ఆయన విదేశాంగ విధానంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో బీఎన్పీ, జమాతే ఇస్లామీ మధ్య పొత్తులు, విభేదాలు ఆసక్తికరంగా మారాయి.
మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాగ్రహానికి జడిసి దేశం విడిచి పారిపోయిన పదవీచ్చుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకి చెందిన అవామీ లీగ్ పార్టీ (Awami League Party)పై నిషేధం విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అవామీ లీగ్‌పార్టీ కోల్పోయింది.
